Why popular of cricket in India
Cricket popularity India ప్రస్తుతం ప్రపంచంలో ఎన్నో రకాల క్రీడలు సాంప్రదాయ బద్ధమైన ఆటలు ఉన్నాయి. అలాగే ప్రాచీన కాలం నుండి కూడా భారతదేశంలో అనేక రకాలైన ఆటలు ఆడుతూ వస్తున్నారు. కానీ ప్రాచీన కాలం నుండి నేటి ఆధునిక యుగం మొదటి వరకు కూడా భారతీయులకు తెలియని ఒక ఆట ప్రస్తుత కాలంలో భారతీయులకు ఒక పిచ్చిగా ఒక వ్యసనంగా ఎందుకు మారింది. దాదాపు 18వ శతాబ్దం వరకు కూడా ఆ ఆట అంటే కూడా భారతీయులకు తెలియదు. 18 శతాబ్దంలో భారతదేశాన్ని తమ యొక్క వలస పాలిత ప్రాంతంగా మార్చుకున్న బ్రిటిష్ వారు మన దేశ ప్రజల యొక్క అలవాట్లు సాంప్రదాయాలలో తీవ్రమైన మార్పులను తీసుకొని రావడం జరిగింది. వీటి ద్వారా భారతీయుడు కూడా ఆంగ్ల వేషధారణకు లోనయ్యాడు.1854లో లార్డ్ మెకాలే ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రులకు ఒక లేఖ రాస్తూ భారతీయులు కేవలం రూపంలోనే భారతీయులని వారి యొక్క అలవాట్లు ఇంగ్లీష్ వారివని ఆ లేఖలో పేర్కొన్నారు. అలా అప్పట్లో తెచ్చిన మెకాలే కమిటీ వల్ల భారతీయులకు ఇంగ్లీష్ ఎంతో దగ్గర అయింది. దీంతో అప్పట్లో భారతీయులు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడంతో కొందరు ఆంగ్లేయులతో దోస్తులుగా కూడా మారారు. అలా స్నేహితులుగా మారిన ఆంగ్లేయులు ...